Site icon TeluguMirchi.com

హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడుతున్నారా ? జాగ్రత్త

హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇప్పుడు హాట్ సేల్ డ్రగ్. కారణం ఇది కరోనా కి పని చేసిందని కేంద్రం చెప్పడం. అయితే దిన్ని ఎవరు పడితే వాళ్ళు వాడుతున్నారు. దీంతో ఈ ఔషధం అందరి కోసం కాదని, దానిని ఎవరికి పడితే వారికి వాడొద్దని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సీనియర్ శాస్త్రవేత్త రమణ్ గంగాఖేడ్కర్ స్పష్టం చేశారు.

కరోనా బాధితులను కలిసిన వారికి మాత్రమే ఈ మందును ఇవ్వాలని సూచించారు. అయితే, ఐసీయూలో ఉంచి వైద్యం చేయాల్సిన పరిస్థితే వస్తే, అటువంటి రోగులకు ఈ ఔషధాన్ని అజిత్రోమైసిన్‌తో కలిపి ఇవ్వొచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా వెల్లడించింది. అయితే, 12 ఏళ్లలోపు చిన్నారులు, గర్భిణులు, పాలిచ్చే తల్లుల విషయంలో మాత్రం ఈ ఔషధ వాడకం గురించి ప్రస్తావించలేదు. దీనిపై ఐసీఎంఆర్ క్లారిటీ ఇచ్చింది.

Exit mobile version