చికెన్‌ ఫ్రై చేయలేదని భార్య ను చంపిన భర్త

ఈ మధ్య చిన్న చిన్న వాటికే చంపుకోవడాలు చేస్తున్నారు. ఆఖరికి భార్య రుచిగా కూర వండలేదని కూడా చంపేసే భర్తలు ఉన్నారు. తాజాగా ఫ్రై చేయలేదని భార్య ను చంపిన భర్త చంపిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే

బెంగుళూర్ లో నివాసం ఉండే ముబారక్‌ పాషా, షిరాను బాను దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆగస్టు 18న చికెన్‌ ఫ్రై వండాలని భార్యకు చెప్పి భర్త బయటకు వెళ్లాడు. పాషా ఇంటికి తిరిగి వచ్చి సరికి భార్య చికెన్‌ ఫ్రై వండలేదు. చెకెన్ ఫ్రై ఎందుకు చేయలేదని ప్రశ్నించాడు. భార్య చెప్పే సమాధానానికి కోపానికి గురైన పాషా.. భార్య తలపై చెక్కతో గట్టిగా కొట్టడం తో ఆమె చనిపోయింది. వెంటనే ఆమె మృతదేహాన్ని ఓ సంచిలో వేసుకుని బైక్ పై బయటకు తీసుకెళ్లాడు. బైక్‌పై చిక్కబనవర సరస్సుకు చేరుకుని మృతదేహాన్ని నీటిలో పడేశాడు. ఆ తర్వాత నాల్గు రోజులకు పాషా నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.