హాకీ దిగ్గజం క్లాడియన్ కన్నుమూత

leslieభారత హాకీ దిగ్గజం లెస్లి క్లాడియన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న క్లాడియన్ గురువారం మధ్యాహ్నం మరణించినట్లు ఆయన కుమారుడు బ్రెండన్ చెప్పాడు. 85 సంవత్సరాల క్లాడియన్ కు భార్య, కుమారుడు ఉన్నారు. 1948 లండన్, 1952 హెల్సింకి, 1956 మెల్ బోర్న్ ఒలింపిక్స్ లో స్వర్ణాలు, 1960 రోమ్ ఒలింపిక్స్ లో రజతం సాధించిన భారత జట్టులో క్లాడియన్ సభ్యుడు. “భారత హాకీకి క్లాడియన్ దేవుడులాంటి వాడు. అతను లేని భారత హాకీని ఊహించలేకపోతున్నా అని మాజీ కెప్టెన్ ధన్ రాజ్ పిళ్లై చెప్పాడు. “నెల క్రితం కోల్ కతలోని హస్పిటల్ లో ఉన్న క్లాడియన్ ను పలకించి వచ్చాం. ఆయన ఎంతో ఉత్సాహంగా కనిపించారు” అని ధ్యాన్ చంద్ కుమారుడు అశోక్ కుమార్ గుప్త గుర్తు చేసుకున్నారు.