Site icon TeluguMirchi.com

ఇదిగో కొత్త రూ.200 నోటు

300 rs noteనోట్ల రద్దు తర్వాత కొత్తగా 2000 రూపాయల నోటు వచ్చింది. ఆ తర్వాత రద్దయిన 500 నోట్లు కొత్త రూపంతో వచ్చాయి. మళ్లీ వెయ్యి రూపాయల నోట్లు వస్తాయని అంతా ఆశిస్తున్న సమయంలో షాకింగ్‌ రెండు వందల రూపాయల నోట్లను మార్కెట్‌లోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవలే తెలుగు దేశం ఎంపీ గల్లా జయదేవ్‌ పార్లమెంటులో మాట్లాడుతూ రెండు వందల నోట్లను తీసుకు రావాలని, రెండు వేల నోట్లను రద్దు చేయాలని కోరాడు. ఆయన విజ్ఞప్తి మేరకో లేదా అంతకు ముందే రెండు వందల నోటును ఆర్బీఐ రెడీ చేసి పెట్టిందో కాని రెండు వందల నోటు వచ్చేసింది.

ఇంకా ఆర్బీఐ విడుదల చేయని రెండు వందల నోటు లుక్‌ ఎలా ఉంటుంది అనేది లీక్‌ అయ్యింది. తాజాగా సోషల్‌ మీడియాలో ఈ నోటు తెగ షేర్‌ అవుతుంది. అయితే కొందరు మాత్రం ఇది ఫేక్‌ రెండువందల నోటు అంటూ కొట్టి పారేస్తున్నారు. అచ్చు ఆర్బీఐ విడుదల చేసినట్లుగా ఉన్న ఈ రెండు వందల నోటు ఉండటం వల్ల ఏది నిజం ఏది అబద్దం అనేది తేల్చుకోలేక పోతున్నారు. అర్బీఐ అధికారులు ఈ నోటుపై స్పందించాలని సామాన్యులు కోరుకుంటున్నారు.

Exit mobile version