బంగారు ఆభరణాలకు హాల్‌మార్క్ తప్పనిసరి చేసేందుకు కేంద్రం ఇచ్చిన గడువు ముగిసింది. దీంతో ఇక పై అన్ని బంగారు ఆభరణాలు, వస్తువులకు హాల్‌మార్క్ తప్పనిసరి అయింది. బంగారు ఆభరణాల స్వచ్ఛతను ధృవీకరించేందుకు హాల్‌మార్క్‌ను వినియోగిస్తారు. గతేడాది నవంబరులో ప్రభుత్వం అన్ని బంగారు ఆభరణాలకు హాల్‌మార్కును తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదట ఈ ఏడాది జనవరి 15 వరకు గడువు విధించారు. తర్వాత కరోనా కారణంగా జూన్ 1 వరకు పొడిగించారు. అనంతరం జూన్ 15 చివరి తేదీగా ప్రకటించారు.