బంగారు ఆభరణాలు, కళాఖండాలపై 2021 జూన్ 1 నుంచీ హాల్‌మార్కింగ్ తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసింది. విలువైన మెటల్‌కు సంబంధించి ప్యూరిటీ సర్టిఫికేషన్ విషయంలో కేంద్రం స్పష్టమైన వైఖరితో ఉందని వర్చువల్ గా జరిగిన ఒక విలేకరుల సమావేశంలో వినియోగ వ్యవహారాల కార్యదర్శి లీనా నందన్ అన్నారు.
2019 నవంబర్‌లో కేంద్రం చేసిన ప్రకటన ప్రకారం, పసిడి ఆభరణాలు, కళాఖండాలపై 2021 జనవరి 15 నుంచీ హాల్‌మార్కింగ్ తప్పనిసరి. హాల్‌మార్కింగ్ విధానంలోకి మారడానికి, ఇందుకు సంబంధించి BISతో తమకుతాము రిజిస్ట్రర్ కావడానికి ఆభరణాల వర్తకులకు ఏడాదికి పైగా సమయం ఇచ్చింది. అయితే కోవిడ్–19 నేపథ్యంలో హాల్‌మార్కింగ్ విధానం అమలుకు వర్తకులు చేసిన విజ్ఞప్తి మేరకు 2021 జూన్ 1 నుండి అమలులోకి రానుంది.