Site icon TeluguMirchi.com

హఫీజ్‌ సయీద్‌ అనుచరులకు 9 ఏళ్ల జైలు శిక్ష

ముంబయి ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి, జమాత్‌-ఉద్‌-దవా అధినేత హఫీజ్‌ సయీద్‌ అనుచరుల్లో ఐదుగురికి లాహోర్‌లోని ప్రత్యేక కోర్టు 9 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పాకిస్థాన్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక వనరులు సమకూర్చిన కేసులో ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఇదే కేసుకు సంబంధించి సయీద్‌ బావమరిది అబ్దుల్‌ రెహమాన్‌ మక్కీకి 6 నెలల జెలు శిక్ష విధించింది.

Exit mobile version