అమెరికాలోని టెక్ సంస్థలకు కరోనా తీవ్ర విఘాతం కలిగించడంతో దాదాపు 90,000 మంది హెచ్1బీ వీసాదారుల భవిష్యత్తుపై అంధకారం నెలకొంది. వీరికి ఉపాధి కల్పిస్తున్న కంపెనీలు చేతులెత్తేయడంతో ఇప్పుడు వీరంతా తమ దేశాలకు వెళ్లిపోక తప్పదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే చాలామంది జీతాల్లేకుండానే పనిచేస్తున్నారు. అమెరికాలో సాధారణ పరిస్థితులు ఎప్పుడు నెలకొంటాయో తెలియని అనిశ్చితి ఏర్పడగా, హెచ్1బీ వీసాదారులను కొనసాగించడం టెక్ కంపెనీలకు మోయలేనంత భారంగా మారింది.