Site icon TeluguMirchi.com

వివాహబంధం తో ఒక్కటైన ప్రేమజంట

గుత్తా జ్వాల ఈ పేరు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఈమె గత కొంతకాలం గా నటుడు విష్ణు విశాల్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట గత సెప్టెంబర్ నెలలో నిశ్చితార్ధం చేసుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కరోనా విజృంభిస్తుండటంతో కొంతమంది సన్నిహితుల మధ్య మొయినాబాద్ లో వివాహం జరిగింది. సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు .

Exit mobile version