ఒక రాజు ఎలాంటి రాజ భోగాలు అనుభవిస్తాడో అదే విధంగా గుర్మీత్ బాబా కూడా బయట ఉన్నంత కాలం రాజ భోగాలు అనుభవించాడు. అయితే ఇప్పుడు గుర్మీత్ బాబా రేప్ కేసులో 20 సంవత్సరాల జైలు శిక్ష పడటంతో ఒక సాదారణ ఖైదీ మాదిరిగా చాలా కఠినమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఒక్కసారిగా పరిస్థితులు అలా మారిపోవడంతో చాలా బాధపడుతున్నాడు. ఆయన మొదటి వారం రోజులు ఏడుస్తూనే ఉన్నాడని జైలు వర్గాల వారు చెబుతున్నారు. ఇక ఇప్పుడిప్పుడే మెల్ల మెల్లగా జైలుకు గుర్మీత్ బాబా అలవాటు పడుతున్నట్లుగా తెలుస్తోంది.
ఈ సమయంలోనే సీబీఐ కోర్టుకు గుర్మీత్ బాబా ఒక అప్పీల్ చేసుకోవడం జరిగింది. తనకు ప్రతి రోజు మసాజ్ అలవాటు. చాలా రోజులుగా మసాజ్ లేకపోవడంతో ఒళ్లంత నొప్పులుగా ఉందని, అందుకే తనకు ఫిజియోథెరఫిస్ట్ అయిన హనీప్రీత్‌ను జైలులోకి అనుమతించాలని, ఆమె మసాజ్ చేస్తే తన నొప్పులు అన్ని పోతాయి అంటూ పిటీషన్ పెట్టుకోవడం జరిగింది. ఈ పిటీషన్‌పై సీబీఐ కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. గుర్మీత్‌బాబా గొంతెమ్మ కోర్కెలకు జైలు సిబ్బంది కూడా అవాక్కవుతున్నారు.