గుడ్ న్యూస్ : 200 వస్తువుల ధరలు తగ్గనున్నాయ్

‘జీఎస్టీ వచ్చే ధరలు పెరిగే. సామాన్యుడి నడ్డి విరిగే’ అని చెప్పుకొంటున్నారు. ఈ నేపథ్యంలో సామాన్యుడి కాస్త ఊరట కలిగే న్యూస్ ఒకటి వచ్చింది. 28 శాతం పన్ను పరిధిలో ఉన్న సుమారు 200కు పైగా వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఈ మేరకు గౌహతిలో జరుగుతున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారమ్.

తాజా నిర్ణయంతో చేత్తో తయారు చేసిన ఫర్నీచర్, షాంపూలు, శానిటరీ వేర్, సూట్ కేసులు, వాల్ పేపర్లు, ప్లైవుడ్, స్టేషనరీ ఉత్పత్తులు, గడియారాలు, ఆట వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఏసీ, నాన్ ఏసీ రెస్టారెంట్లలో ధరల రేట్ల మధ్య స్పష్టమైన తేడా రానుంది. కాగా, అసోం ఆర్థికమంత్రి హిమాంత బిశ్వ శర్మ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ, పన్ను శ్లాబ్ తగ్గించాల్సిన వస్తువుల జాబితాను తయారు చేసిన సంగతి తెలిసిందే.

వీటిలో జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించిన వాటిని ఈ సాయంత్రం ప్రకటించనున్నారు.