ఇప్పటి వరకు ఆసియా అపర కుబేరుడి కిరీటం ముకేశ్ అంబానీదే. తాజాగా ఈ ఘనత గౌతమ్ అదానీకి వెళ్లింది. గత ఏడాది కాలంలోనే అదానీ సంపద 55 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.4.12 లక్షల కోట్లు/ రోజుకు రూ.1000 కోట్లకు పైగా) పెరగడమే ఇందుకు కారణం. అదే సమయంలో ముకేశ్ అంబానీ నికర సంపద విలువ 14.3 బిలియన్ డాలర్ల (రూ.1.07 లక్షల కోట్లకుపైగా) మేరే పెరిగినందున ముకేశ్ స్థానాన్ని అదానీ సొంతం చేసుకోగలిగారని బ్లూమ్‌బర్గ్ వెల్లడిస్తోంది.