Site icon TeluguMirchi.com

గవర్నర్‌ నరసింహన్‌ సంచలన నిర్ణయం

సాదారణంగా గవర్నర్‌లు అంటే కేవలం రాజ్‌ భవన్‌కు మాత్రమే పరిమితం అయ్యి ఉంటారు. కాని తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ మాత్రం పూర్తి విభిన్నం. ఎప్పటికప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి, అధికారులు ఎలా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అందరికి అందుతున్నాయా అంటూ అన్ని విషయాలను ఆయన బ్దిదారులను అడిగి మరీ తెలుసుకుంటూ ఉంటాడు.

స్కూల్స్‌ మరియు కాలేజ్‌లకు వెళ్లడం అక్కడ పరిస్థితులను సరిదిద్దే ప్రయత్నం చేయడం వంటివి నరసింహన్‌ చేసేవారు. తాజాగా గవర్నర్‌ నరసింహన్‌ మరో సంచలన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఇకపై తాను తన కుటుంబ సభ్యులు ఏ చిన్న అనారోగ్యం అయినా కూడా ప్రభుత్వ హాస్పిటల్‌ అయిన గాంధీ హాస్పిటల్‌లోనే చికిత్స అందుకుంటామని గవర్నర్‌ పేర్కొన్నారు. నేడు గాంధీ హాస్పిటల్‌లో 65 బెడ్స్‌తో కొత్తగా ఐసీయూని ఏర్పాటు చేయడం జరిగింది.

ఆ ఐసీయూను అత్యధిక టెక్నాజీతో రూపొందించడం జరిగింది. ఆ ఐసీయూను ప్రారంభించిన తర్వాత నరసింహన్‌ మాట్లాడుతూ తాను ఇదే హాస్పిటల్‌కు ఇకపై ఏ చిన్న అనారోగ్యం వచ్చినా కూడా ఇక్కడికే వస్తామని నరసింహన్‌ చెప్పుకొచ్చాడు.

Exit mobile version