Site icon TeluguMirchi.com

బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్

భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ) బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్ అందించింది. ఇకపై నగదు బదిలీకి సంబంధించిన ‘రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌’ ఆర్టీజీఎస్‌ సేవల్ని 24 గంటలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఇది డిసెంబరు 14 నుంచి 24*7 అమల్లోకి రానున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ వెల్లడించారు. ఇప్పటికే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్-NEFT 24 గంటలు అందుబాటులోకి తీసుకొచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

ఇప్పుడు ఆర్‌టీజీఎస్ సేవల్ని కూడా 24 గంటలు అందుబాటులోకి తీసుకొస్తోంది. దీంతో ప్రపంచంలో ఆర్‌టీజీఎస్ సేవల్ని నిరంతరాయంగా అందిస్తున్న దేశాల్లో భారతదేశం కూడా ఒకటి అవుతుందని ఆర్‌బీఐ తెలిపింది.

Exit mobile version