జలదిగ్బంధంలో గ్రామాలు!

flood-water-logged-in-kovvuru-in-west-godavari-district-on-sunday-narayana-raoeps_2గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో పరీవాహక ప్రాంతంలో పలుగ్రామాలు వరద ముప్పు తో అల్లాడి పోతున్నాయి . పశ్చిమగోదావరి జిల్లాలోని పలు లంక గ్రామాలు గోదావరి వరదతో ముంపుకు గురయ్యాయి. ఆచంట, యలమంచిలి మండలాల్లోని చాలా గ్రామాల్లో పది అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. నివాసాలు, విద్యుత్ స్థంభాలు, మంచినీటి బోర్లు నీట మునిగాయి. దీంతో, అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ప్రజలను బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద పరిస్థితిని సమీక్షించిన జిల్లా కలెక్టర్ ప్రతి మండలానికి ఓ ప్రత్యేక అధికారిని నియమించారు. సహాయ కార్యక్రమాల పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు.