రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ పరిస్థితులపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి ఎక్కువగా కేసులు నిర్ధారణ అవుతున్న జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రత్యేకంగా దృష్టిసారించాలని కేసీఆర్ ఆదేశించారు. ప్రస్తుతం నగరంలోని 17 సర్కిళ్లను 17 జోన్లుగా విభజించి ప్రత్యేక అధికారులను నియమించాలని తద్వారా పూర్తిస్థాయిలో పర్యవేక్షించాలని సీఎం దిశానిర్దేశం చేశారు.
వైద్యఆరోగ్యశాఖతో పాటు రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ శాఖల అధికారులను ఆయా జోన్లకు నియమించి వారి ద్వారా ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రతిరోజూ జోన్ల వారీగా సమీక్షించాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు సీఎం సూచించారు. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా సిద్ధం కావాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.