Site icon TeluguMirchi.com

‘గే’ సెక్స్ ఇల్లీగల్ : సుప్రీం కోర్టు

Gay sex illegal says Supreme Courtస్వలింగ సంపర్కం చట్టబద్ధమా?.. కాదా..? అన్న విషయంపై సుప్రీం కోర్టు కీలకతీర్పునిచ్చింది. గే సెక్స్ చట్టవిరుద్ధమంటూ దీనిపై నెలకొన్న సందిగ్ధతకు తెరదించింది. న్యాయమూర్తులు జి.ఎస్.సింఘ్వి, ఎస్.జె. ముఖోపాధ్యాయలతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఉత్తర్వులిచ్చింది. భారత రాజ్యాంగం ప్రకారం గేసెక్స్ శిక్షార్హమని ప్రకటించింది. స్వలింగ సంపర్కం చట్టబద్దమేనన్న ఢిల్లీ హైకోర్టు తీర్పుని సుప్రీం తోసిపుచ్చింది. సుప్రీం తీర్పుపై స్వలింగ సంపర్కులు నిరాశ చెందగా… సంప్రదాయవాదులు సంతోషం వ్యక్తం చేశారు.

Exit mobile version