కొత్త ప్రయాణం ప్రారంభించబోతున్నానంటూ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చేసిన ట్వీట్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. గంగూలీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే చర్చ జోరుగా సాగింది. అంతే కాదు బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నారని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే సదరు ట్వీట్‌పై దాదా వివరణ ఇచ్చాడు. తన పొలిటికల్ ఎంట్రీపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించాడు. కొత్త ప్రయాణమంటూ తాను చేసిన ట్వీట్‌ను కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించారని స్పష్టం చేశాడు.
తాను ఓ ఎడ్యుకేషనల్ యాప్‌ను ప్రారంభించానని, ఇది ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంటుందని వివరణ ఇచ్చాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగుతానని స్పష్టం చేశాడు. ఇదే విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా కూడా దృవీకరించాడు. దీంతో గంగూలీ రాజకీయ రంగ ప్రవేశంపై జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్లైంది. అయితే ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో గంగూలీ రెండుసార్లు భేటీ కావడంతో దాదా పొలిటికల్ ఎంట్రీ ఖాయమని సర్వత్రా ప్రచారం జరిగింది.