Site icon TeluguMirchi.com

ధోనీకి గంగూలీ సలహా

టీం ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ రిటైర్మెంట్‌ గురించిన వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ధోనీ ప్రపంచకప్‌ తర్వాత గౌరవంగా తప్పుకుని ఉంటే బాగుండేది. కాని ధోనీ ఇప్పటి వరకు తన రిటైర్మెంట్‌ను ప్రకటించలేదు. ప్రస్తుతానికి ఈయన క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. రెండు నెలలు బ్రేక్‌ తీసుకున్న ధోని మళ్లీ టీం ఇండియాతో జత కట్టబోతున్నాడు. ప్రస్తుతం ఇండియా జట్టు విండీస్‌తో సిరీస్‌లు ఆడుతోంది. ఆ సిరీస్‌లకు ధోనీ దూరంగా ఉన్నాడు.

తాజాగా ధోనీ విషయమై టీం ఇండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ స్పందించాడు. చాలా ఏళ్లుగా ధోనీ రిటైర్మెంట్‌ గురించి ప్రచారం జరుగుతోంది. ఆ విషయమై ఆయనే నిర్ణయం తీసుకోవాలి. జట్టుకు తన అవసరం ఎంత ఉంది.. ఏ స్థాయిలో తన ఆట జట్టుకు ఉపయోగదాయకంగా ఉందనే విషయాన్ని ఆయన గుర్తించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాలంటూ సలహా ఇచ్చాడు. గంగూలీ ఇండైరెక్టర్‌గా ధోనీని రిటైర్‌ అవ్వమంటూ సలహా ఇచ్చాడు. మరి ఈ సలహాపై ధోనీ రియాక్షన్‌ ఎలా ఉంటుందో చూడాలి.

Exit mobile version