నయీంలో 'ఆడే'శాలు కూడా ఉన్నాయట.. !

nayeem
ఇటీవలే పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్ స్టర్ నయీం నేరల పుట్ట తొవ్వేకొద్ది కొత్త నేరాలు పుట్టుకొన్నాయి. భూదందాలు, హత్యలు, బెదిరింపులు, అత్యాచారాలు, మైనర్ బాలికలపై అత్యాచారం, ఓ స్టార్ హీరోయిన్ తో ఎఫైర్.. ఇలా చిట్టా పెద్దది. అయితే, సిట్ దర్యాప్తులో తవ్వే కొద్ది సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజా నయీం ఆడేశాలు కూడా బయటపడ్డాయి. పోలీసుల కళ్లుగప్పి నయీం ఆడవేశంలో తిరిగేవారట. ఇందుకు సంబంధించిన మేకప్ క్విట్లు నయీం బెడ్ రూంలో దొరికాయి. ఆడవేశంలో నయీం దిగిన ఓ ఫోటో ఒకటి బయటికొచ్చింది.
నయీంకి మొత్తం 20 ఇళ్ల ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. త్వరలోనే కోర్టు ఆదేశాలతో వాటిని స్వాధీనం చేసుకోనున్నట్టు సిట్ అధికారులు చెబుతున్నారు. ఇక, యాదగిరి గుట్టలో పోలీసు ఉన్నతాధికారికి నయీం 80 ఎకరాలు ఇప్పించినట్లు దర్యాప్తులో తేలింది. మొత్తానికి నయీం ఆగడాలు ఒకొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే లింకున్న ప్రముఖ రాజకీయ, ప్రభుత్వ అధికారుల పేర్లు బయటికొస్తున్నాయి. త్వరలోనే నయీం ఏపీసోడ్ లో మరిన్ని దిమ్మతిరిగే నిజాలు వెలుగులోకి రావడం ఖాయం అంటున్నారు సిట్ అధికారులు.