2012 జులైలో యూట్యూబ్‌లో పోస్ట్ అయిన ఒక పాట ప్రపంచాన్ని ఉర్రూతలూగించింది. 250 కోట్ల మంది ఆ పాటను యూట్యూబ్‌లో చూశారు. ఆ పాట ఎక్కడ ఏ వేడుక జరిగినా కూడా వినిపించేది. ఆ పాటకు చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ల వరకు అంతా కూడా స్టైప్పులు వేసేందుకు ప్రయత్నించారు. ఇప్పటికే అర్థం అయ్యి ఉంటుంది. ఆ పాట ఏంటో.. అవును గంగ్నమ్ స్టైల్ పాట. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆ పాట ఇప్పటి వరకు యూట్యూబ్‌లో 289 కోట్ల వ్యూస్‌ను దక్కించుకుంది.
యూట్యూబ్‌లో ఆ స్థాయిలో వ్యూస్‌ను దక్కించుకోవడం ఈ అయిదు సంవత్సరాల్లో ఏ వీడియోకు సాధ్యం కాలేదు. సరిగ్గా అయిదు సంవత్సరాలు పూర్తి అవుతున్న ఈ సమయంలో గంగ్నమ్ స్టైల్ పాట రికార్డు బ్రేక్ అయ్యింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సీయూఎగైన్ పాట పాపులర్ అయ్యింది. 291 కోట్ల వ్యూస్‌ను ఇప్పటి వరకు ఈ పాట సొంతం చేసుకుంది. అయితే ఇండియాలో మాత్రం గంగ్నమ్ స్టైల్ పాటకు వచ్చినంత క్రేజ్ ఈ పాటకు రాలేదు.
అమెరికా, లండన్ వంటి దేశాల్లో ఈ పాట బాగా ప్రాచుర్యం పొందుతుంది. అయిదు సంవత్సరాలు అయినా కూడా గంగ్నమ్ డ్యాన్స్‌ను వేస్తూనే ఉన్నారు. సీయూ ఎగైన్ పాట మాత్రం డ్యాన్స్‌కు అంత అనుకూలంగా లేదు. ఇండియన్స్‌ను కూడా సీయూ ఎగైన్ పాట ఆకట్టుకుని ఉంటే మరో 50 కోట్ల వ్యూస్ అదనంగా వచ్చేవి, అలాగే మరి కొన్ని రోజుల ముందే గంగ్నమ్ స్టైల్ రికార్డు బ్రేక్ అయ్యేది.