వరంగల్‌లో మరో దారుణం

కొన్ని వారాల క్రితమే వరంగల్‌లో ఒక చిన్నారిపై ఒక రాక్షసుడు అఘాయిత్యం చేసి చంపేసిన విషయం మర్చి పోకుండానే మరో దారుణం జరిగింది. వరంగల్‌కు చెందిన 15 ఏళ్ల బాలిక సామూహిక అత్యాచారంకు గురైంది. దాంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురై చివరకు ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్య చేసుకున్న తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది. తల్లిదండ్రులను కోల్పోయి నానమ్మ వద్ద ఉంటున్న ఆ అమ్మాయి ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వరంగల్‌ లోకల్‌ సమ్మయ్య నగర్‌కు చెందిన బాలిక తల్లిదండ్రులను కోల్పోయి నానమ్మ వద్ద ఉంటూ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళ్తుంది. హసన్‌పర్తి మండలం పెంబర్తి గ్రామానికి చెందిన తిరుపతి మరియు ప్రసన్నకుమార్‌లతో ఆ బాలికకు పరిచయం ఉంది. ఆ పరిచయంతో శనివారం వారిద్దరితో కలిసి వెళ్లింది. టూవీలర్‌ వాహంనపై వారిద్దరు బాలికను నిర్మానుశ ప్రాంతంకు తీసుకు వెళ్లి అఘాయిత్యంకు పాల్పడ్డారు. ఆ ఇద్దరితో పాటు మరో బాలుడు కూడా వారితో ఉన్నాడు.

అత్యాచారం తర్వాత బాలిక జరిగిన విషయాన్ని నయనమ్మకు చెప్పింది. ఆ తర్వాత కూడా చాలా మదనపడింది. ఆదివారం రాత్రి సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని మరణించింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఒకడిని పట్టుకుని మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.