Site icon TeluguMirchi.com

తెలుగుమిర్చి వీక్షకులకు గాంధీ జయంతి శుభాకాంక్షలు

Gandhi-Jayanti
మోహన్‌దాస్‌ కరమ్‌ చంద్‌ గాంధీ… మన జాతి పిత అని మాత్రమే చెబితే అసంపూర్తిగా అసంతృప్తిగా ఉంటుంది. భారతదేశానికి అహింసామార్గంలో స్వాతంత్య్రం సముపార్జించిపెట్టిన సత్యాగ్రహ సేనాని. జీవితాన్నే ప్రయోగశాలగా మార్చుకుని సత్యశోధన చేసిన మహా జ్ఞాని. బాపూజీగా భారతీయుల అభిమానం చూరగొన్న మహనీయుడు. భూమిపై ఇలాంటి మనిషి ఒకరు జీవించారా అని మహామహులు సైతం ఆశ్చర్యపోయిన గొప్ప వ్యక్తిత్వం ఆయన సొంతం. గాంధీ జీవితం యావత్‌ ప్రపంచానికి ఆదర్శనీయం..ఆచరణీయం. అందుకే భారతదేశాన్ని బానిసదేశంగా ఏలిన బ్రిటిష్‌వారు సైతం ఆయన మహనీయతను వెండితెరపై ఆవిష్కరించుకుని పులకించిపోయారు. అపూర్వరీతిలో సాగిన గాంధీజీ జీవనయాత్రకు తెరరూపమే ‘గాంధీ’ చిత్రం. బాపూజీ పాత్రలో బ్రిటిష్‌ నటుడు రిచర్డ్‌ అటెన్‌బరో నటించిన ఈ చిత్రానికి భారతీయులు మాత్రమే కాదు ప్రపంచం నలుచెరుగులా నీరాజనాలు పట్టారు. గాంధీజీ సంకల్పంలోనూ, సమరదీక్షలోనూ ఉన్న ప్రత్యేకతే అందుకు కారణం. 1893లో యువగాంధీని దక్షిణాఫ్రికాలో రైలు నుంచి గెంటివేసిన దగ్గర్నుంచి, 1948లో గాంధీ మరణం వరకూ ఆయన జీవితంలోని ప్రతిఘట్టాన్నీ కళ్లకు కట్టిన చిత్రం ‘గాంధీ’. ఆస్కార్‌ పురస్కారాలు కూడా ‘గాంధీ’ గొప్పతనానికి పట్టంకట్టాయి. 11 నామినేషన్లకుగాను ఏకంగా 8 ఆస్కార్‌ పురస్కారాలు కైవసం చేసుకొందీ చిత్రం. మానవజాతి మర్చిపోలేని మహామనీషి గాంధీ. నేడు ఆయన జయంతి సందర్భంగా‘గాంధీ’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల కోసం తెలుగులో అందిస్తోంది ఈటీవీ. ఈటీవీలో ఈ రోజు ఉదయం 8.30కు ‘గాంధీ’ చిత్రం తెలుగులో ప్రసారమవుతుంది.

Exit mobile version