Site icon TeluguMirchi.com

గాంధీ ఆస్పత్రి నుంచి కరోనా బాధితుడు పరార్

కరోనా వైరస్‌ బాధితుడు గాంధీ ఆస్పత్రి నుంచి పరారవడం కలకలం రేపుతోంది. నిన్న రాత్రి సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డు నుంచి గద్వాలకు చెందిన ఓ వ్యక్తి పారిపోయినట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాధితుడి ఆచూకీ కోసం ఇటు చిలకలగూడ పోలీసులతోపాటు.. గద్వాల పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపట్టారు.

ఇటీవల కరోనా మహమ్మారితో మరణించిన రోగి బంధువులు వైద్య సిబ్బందిపై దాడి చేసిన ఘటన నేపథ్యంలో గాంధీ ఆస్పత్రిలో భద్రత భారీగా పెంచారు. ఇంత కట్టుదిట్టమైన భద్రతా మధ్య కరోనా రోగి ఎలా పారిపోయాడనే అంశం ప్రశ్నార్థకంగా మారింది. జోగులాంబ గద్వాల జిల్లాలో ఇప్పటివరకు 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో పలువురు ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చినవారు ఉన్నారు.

Exit mobile version