Site icon TeluguMirchi.com

పాకిస్థాన్ ఆటగాడికి వార్నింగ్ ఇచ్చిన గంభీర్


సుదీర్ఘ ఇంగ్లాండ్ పర్యటన తరువాత బీసీసీఐ టీమ్ ఇండియా సారధి విరాట్ కోహ్లీ కి విశ్రాంతి నివ్వడం మనకు తెలిసిందే. విరాట్ స్థానంలో ఆసియా కప్ కు సారధి భాద్యతలు రోహిత్ శర్మ ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకుని కోహ్లీపై పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ తన్వీర్‌ అహ్మద్‌ వ్యంగ్యాస్త్రాలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్ అంటే ఉన్న భ‌యం కార‌ణంగానే ఆసియా క‌ప్ నుంచి కోహ్లీ పారిపోయాడ‌ని వ్యాఖ్యానించాడు.. ఓ మీడియాతో మాట్లాడుతూ కోహ్లీపై తన్వీర్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు.

నా అంచనా ప్రకారం ఇండియా పాకిస్థాన్‌తో ఫైనల్స్‌తో సహా మూడు సార్లు తలపడాల్సివస్తుందని కోహ్లీ ముందే ఊహించి ఉంటాడు. అందుకే ఎస్కేప్‌ అయ్యాడు’ అంటూ వ్యాఖ్యానించాడు. పాకిస్థాన్ జ‌ట్టుతో ఆడ‌డానికి కోహ్లీ భ‌య‌ప‌డి ఉంటాడు. ఇంగ్లండ్‌తో అన్ని మ్యాచ్‌లూ ఆడిన‌వాడు ఆసియా క‌ప్ నుంచి ఎందుకు నిష్క్ర‌మించాడు` అని త‌న్వీర్ విమ‌ర్శించాడు.

అయితే త‌న్వీర్ వ్యాఖ్య‌ల‌పై టీమిండియా క్రికెట‌ర్ గౌత‌మ్ గంభీర్ ఘాటుగా స్పందించాడు. `విరాట్ కోహ్లీ ఇప్ప‌టికే 35-36 సెంచ‌రీలు చేశాడు. అలాంటి అట‌గాడికి మ‌రో సెంచ‌రీ చేయ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. కానీ, త‌న్వీర్ అనే ఆట‌గాడు క‌నీసం 36 అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా ఆడ‌లేక‌పోయాడు. అది గుర్తుపెట్టుకుంటే మంచిది` అని గంభీర్ రిప్లై ఇచ్చాడు.

Exit mobile version