
ప్రముఖస్మార్ట్ ఇరిగేషన్ పరిష్కారం అందించే నెటాఫిమ్ ఇండియా ప్లెక్స్ నెట్ ™ (FlexNet™) ప్రవేశపెట్టారు. ఇది భారతీయ వ్యవసాయదారులకు ఉపరితల మరియు భూమి లోపల డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్స్ కొరకు మెయిన్ లైన్ మరియు సబ్-మెయిన్ లైన్ పైపింగ్ కొరకు ఉపరితల మరియు భూమి లోపల డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్స్ కొరకు పైపింగ్ సొల్యుషన్ #FarmingSimplified తో పాటు కూలీల ఖర్చులో 30% వరకు తగ్గింపు అందిస్తుందిచేయుటకు ఒక విప్లవాత్మకమైన విధానం. ఈ వివిధ రకాల పైపింగ్ సొల్యున్ ఏ రకమైన రబీ, ఖరీఫ్, కాయకూరలు, తీగజాతి పంటలు, లేదా వరుస క్రమంలో డ్రిప్ ఇరిగేషన్ ఉపయోగించే ఏ ఇతర పంటల రకాల కైనా ఉపయోగించ వచ్చు. ఈ ఉత్పాదనను శ్రీ రణధీర్ చౌహాన్, మేనేజింగ్ డైరెక్టర్ – నెటాఫిమ్ ఇండియా సోషల్ మీడియా వేదిక పై విడుదల చేసారు మరియు దేశంలో 25 లక్షల రైతులు దీనిని వీక్షించారు.
నెటాఫిమ్ యొక్క ప్లెక్స్ నెట్ ™ విధానం, సాంప్రదాయ పీవీసి మరియు అలాగే లే ఫ్లాట్ ట్యూబింగ్ సిస్టమ్ తో ముఖ్యంగా దీనిని సులభంగా మోసుకుపోవట మరియు ఇతర సౌకర్యాల విషయంలో వైవిధ్యత కలిగి ఉంటుంది. ఈ ఉత్పాదన యొక్క ఒక విశిష్టమైన లక్షణం, ఇది తేలికగా వుంటుంది మరియు దీని దృఢత్వం కారణంగా, రైతులకు దీనిని బిగించుట మరియు ఉపయోగించుట చాలా అనుకూలంగా ఉంటుంది. తక్కువ ఉత్పాదన బరువు, అనుకూల ఔట్లెట్ రిక్త స్థానాలు , మరియు ప్రత్యేకంగా రూపొందించిన డ్రిప్ లైన్ కనెక్టర్స్ కారణంగా, ఈ పోర్టబుల్ పైప్స్ ను రైతులు సులభంగా లేఅవుట్ చేసి వాడుకొని, వీటిని మళ్లీ తిరిగి వినియోగించుకోవచ్చు. వీటి ఈ లక్షణాల వలన, పీవీసి మరియు లేఫ్లాట్ ఇస్టలేషన్ తో పోల్చినప్పుడు, రైతులకు వీటిని బిగించే సమయం మరియు కూలీల ఖర్చు 30% వరకు తగ్గుతుంది. పేటెంట్ చేయబడిన మెటీరియల్ మరియు వీవింగ్ టెక్నాలజీ ద్వారా వీటి దృఢత్వం మరియు సులభమైన ఫోల్డింగ్ ఫ్లెక్సిబిలిటీ తో తయారు చేసిన కారణంగా రవాణా సౌలభ్యం చక్కగా ఉంటుంది. లోపల వైపు వెల్డ్ చేసిన కనెక్టర్లు ద్వారా డిస్ట్రిబ్యూషన్ పైపుల మధ్య సురక్షితమైన లీక్ ప్రూఫ్ కనెక్షన్లు ఏర్పాటు చేయబడి, తర్వాత వాటిలో కూడా ఇరిగేషన్ సామర్థ్యం పెంపొందించి, మెరుగైన పంట ఫలసాయం కొరకు సరసమాన నీటి సరఫరాను సునిశ్చితం చేస్తుంది.
ఈ తర్వాత తరం పైపింగ్ సిస్టం ద్వారా రైతులకు తెలివైన మరియు సుస్థిర నీటి సరఫరా మెకానిజం లభిస్తుంది. ప్రీమియం పోలీప్రోపలీన్ మెటీరియల్ ద్వారా నీటి వృధాని అరికట్టబడి, అత్యంత విపరీతమైన క్లైమేటిక్ మరియు వాతావరణ పరిస్థితులలో కూడా ఈ ఉత్పాదన సుస్థిరంగా పని చేస్తుంది. ఇది వీడింగ్ మరియు మడ్డీ స్పాట్స్ తగ్గిస్తుంది, పేటెంటెడ్ ఔట్లెట్స్ మరియు పైప్ మధ్య పెర్ఫక్ట్ సీలింగ్ ప్రశంసనీయం, ఇది అనేక సంవత్సరాల వరకు అత్యుత్తమ పనితనాన్ని సునిశ్చితం చేస్తుంది. ఇది పూర్తి బ్రాంచింగ్ లైన్ మరియు తర్వాత కనెక్టర్లను అన్ని నెటాఫిమ్ సిస్టంలకు అనుకూలంగా ఉండేలా చూస్తుంది. వైట్ కలరింగ్ వల్ల థర్మల్ ప్రతిరోధకత లభిస్తుంది మరియు ఇది హై కెమికల్ మరియు యు.వి ఎక్సపోజర్ ను తట్టుకుంటుంది.
నెటాఫిమ్ ఇండియా అందించే ప్లెక్స్ నెట్ ™ సొల్యుషన్ 2 అంగుళాల నుంచి ప్రారంభించి 5 అగుళాల వరకు డయామీటర్లలో లభిస్తుంది మరియు పైప్ వాల్వ్, డ్రిప్ లైన్ కనెక్టర్ మరియు పంచర్ కిట్ తో లభిస్తుంది. సబ్ మెయిన్ లైన్ ఔట్ పుట్ మాత్రం వరుసగా 2.5 (రెండున్నర), 4, 5 మరియు 6 అడుగుల తేడాతో లభిస్తుంది. సబ్-మెయిన్ లైన్ చివరి క్యాప్ మూసి వేయుటకు ఉన్నఫీచర్ మరియు క్లీనింగ్ కొరకు తెరచుటకు అవకాశం ఉంది. ఇది పూర్తి లైన్ బ్రాంచింగ్ కు మరియు తర్వాత వచ్చే అన్ని కనెక్టర్లు నెటాఫిమ్ సిస్టమ్స్ కు అనుకూలంగా ఉంటాయి. ఏదైనా కారణం చేత, పైప్ పంక్చర్ కావటం జరిగితే, ఎలాంటి కష్టం లేకుండా పంక్చర్ కిట్ తో, ఎలాంటి ప్రత్యేక సహాయం అవసరం లేకుండా సులభంగా రిపేరు చేయవచ్చు. దీని దృఢమైన పైపింగ్ సొల్యుషన్ ను సులభంగా తొలగించవచ్చు మరియు ఇరిగేషన్ తర్వాత ఇంట్లో ఎక్కడైనా సురక్షితంగా పెట్టుకోవచ్చు.
“నెటాఫిమ్ ఇండియా, భారతీయ రైతులకు సాటిలేని మోడర్న్ ఫార్మింగ్ సొల్యుషన్ అందజేయుటకు అంకితమై ఉంది. ఇండియా లోని వ్యవసాయ క్షేత్రం ప్రధానంగా, చిన్న చిన్న భూభాగాల రూపంలో విభజించబడి ఉన్నప్పటికీ, అత్యాధునిక సాంకేతిక నవీనతలు ఏ భారతీయ రైతు సోదరులకు అందకుండా పోవటం మనం ఆశించ లేము. ప్లెక్స్ నెట్ ™ పరిచయం చేయుటలోని ముఖ్య ఉద్దేశం ఉపరితల మరియు భూమి లోపల డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్స్ కొరకు పైపింగ్ సొల్యుషన్ #FarmingSimplified తో పాటు కూలీల ఖర్చులో 30% వరకు ఆదా అవుతుంది. టెక్నాలాజికల్ ఎక్సలెన్స్ ముఖ్య లక్షణంగా వచ్చిన ఈ పైపింగ్ సొల్యుషన్ ద్వారా రైతులకు తమ పొలాల మీద గొప్ప సపోర్ట్ మరియు స్వయం ప్రతిపత్తి లభిస్తాయి.” అని శ్రీ రణధీర్ చౌహాన్, మేనేజింగ్ డైరెక్టర్ – నెటాఫిమ్ ఇండియా ఈ సందర్భంగా తెలిపారు.
నెటాఫిమ్ ఇండియా, ప్లెక్స్ నెట్ ™ లాంచ్ ద్వారా రాబోయే సంవత్సరంలో ఇరిగేషన్ లో ఉన్న 1 లక్ష హెక్టార్ల భూమిని కవర్ చేసి, ఇండియాలోని 50,000 మంది రైతులకు ఇది చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నది. తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో ఈ కంపెనీ అదనంగా 10-15% రైతు సముదాయాలను చేరి, ఇరిగేషన్ లో ఉన్న 3,200 హెక్టార్ ఫార్మ్ ల్యాండ్ ను కవర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది.