Site icon TeluguMirchi.com

ఫిక్సింగ్ ని చట్టబద్దం చేయాల్సిందే : ఫిక్కీ

FICCIస్పాట్ ఫిక్సింగ్ వ్యవహారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు స్పాటిఫిక్సింగ్ ను చట్టబద్దం చేయాలంటూ మరికొందరు సలహాలు కూడా ఇస్తున్నారు. బెట్టింగ్ ను చట్టబద్దం చేయడం ద్వారా ఆదాయానికి ఆదాయం పెరుగుతుంది. వినోదానికి వినోదం లభిస్తుందని వారు వాదిస్తున్నారు. నిన్నమొన్నటివరకు ఈ డిమాండ్ కొంతమంది సినీతారలు, సీనియర్ క్రికెటర్లు విశ్లేషకుల ద్వారా వచ్చింది. అయితే తాజాగా వీరి సరసన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ (ఫిక్కీ) కూడా చేరింది. బెట్టింగ్ ను నిషేధించినప్పటికీ గుట్టుగా అది కొనసాగుతోందని ఒక ప్రకటనలో పేర్కొంది. స్పాట్ ఫిక్సింగ్ లో బ్లాక్ మార్కెట్ విధానాల ద్వారా ప్రభుత్వానికి రూ. 12- 20 వేల కోట్లు నష్టం వస్తోందని ఫిక్కీ పేర్కొంది. నిజంగా బెట్టింగ్ చట్టపరమైతే.. చిన్నా..చితకా అంతా కాయ్ రాజాలే అవుతారుగా మరీ.

Exit mobile version