Site icon TeluguMirchi.com

సీరమ్ ఇన్‌స్టిట్యుట్‌‌లో భారీ అగ్ని ప్రమాదం..

పుణెలోని సీరం సంస్థ టెర్మినల్‌ గేట్‌-1 వద్ద ఈ అగ్నిప్రమాదం సంభవించింది. సెజ్‌ 3లో నిర్మాణంలో ఉన్న భవనంలో అగ్నిప్రమాదం సంభవించడంతో నాలుగు, ఐదో అంతస్తులోకి పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు.

దేశంలో కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తిలో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆక్స్‌ఫర్డ్ – ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా రూపొందించిన కొవిడ్ వ్యాక్సిన్‌ను భారత్‌లో ‘కొవిషీల్డ్’ పేరుతో ఈ సంస్థ ఉత్పత్తి చేస్తోంది. ఇక్కడ నుంచి దేశవ్యాప్తంగా టీకాలు పంపిణీ చేస్తున్నారు. విదేశాలకు కూడా వ్యాక్సిన్ ఎగుమతులు ప్రారంభమయ్యాయి.

ప్రమాదం చోటు చేసుకున్న భవనం నిర్మాణంలో ఉన్నట్లు న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐ ట్వీట్ చేసింది. కరోనా వ్యాక్సిన్లు, వ్యాక్సిన్ ప్లాంట్ సురక్షితంగా ఉన్నాయని వెల్లడించింది.

Exit mobile version