పెళ్లి మండపంలో హఠాత్తుగా అగ్నిప్రమాదం జరిగింది. అందరు హాహా కారాలు చేస్తు వధువరుల్ని కాపాడారు. ఇంత జరుగుతున్నా కొంతమంది మాత్రం తాపీగా పెళ్లి భోజనాలు చేస్తు కూర్చున్నారు.
వివరాల్లోకి వెళ్తే, థానేలో అన్సారీ మ్యారేజ్ హాల్‌లో ఆదివారం (నవంబర్ 29 ) సాయంత్రం ఓ పెళ్లి వేడుక జరిగింది. అగ్ని ప్రమాదం వల్ల రాత్రి 8 గంటల సమయంలో కల్యాణ మండపంలో భారీగా మంటలు లేచాయి. అతి కష్టం మీద వరుడిని, వధువును కాపాడారు బంధువలు. పెళ్లికి వచ్చినవారిలో చాలామందితో పాటు ఆ చుట్టుపక్కలవారు కూడా వచ్చి మంటలను ఆర్పేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.
కానీ.. కొందరు వ్యక్తులు మాత్రం తమకేం పట్టనట్లుగా..తాపీగా కూర్చుని ఏమాత్రం కదలకుండా విందు భోజనం అరగించారు. వెనకాల పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నా..వారు ఏమాత్రం కదలకుండా..చలించుకుండా భోజనాలు లాగించేస్తున్నారు. ఈ వింత ఘటనను ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అదికాస్తా వైరల్ గా మారింది