సిరీస్‌ను ఇప్పటికే చేజార్చుకున్న భారత్, చివరి మ్యాచ్‌లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని తాపత్రయపడుతోంది. ఇంగ్లాండ్‌తో ఆఖరి (ఐదో) టెస్టుకు సిద్దమైయింది. చివరి టెస్ట్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఇంగ్లండ్.
ఈ మ్యాచ్‌లో రెండు మార్పులతో టీమిండియా బరిలోకి దిగుతున్నది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానంలో హనుమ విహారి టీమ్‌లోకి వచ్చాడు. విహారికి ఇదే తొలి మ్యాచ్. ఇండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన 292వ ప్లేయర్ విహారి.. మరోవైపు అశ్విన్ స్థానంలో జడేజా టీమ్‌లోకి వచ్చాడు. మరోవైపు ఇంగ్లండ్ మాత్రం సౌతాంప్టన్‌లో ఆడిన టీమ్‌తోనే బరిలోకి దిగుతున్నది.
కెరీర్‌లో ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడబోతున్న ఓపెనర్ అలిస్టర్ కుక్‌పైనే అందరి దృష్టి నిలిచింది. గత కొన్నేళ్లుగా కేవలం టెస్టు మ్యాచ్‌లే ఆడుతున్న కుక్.. తాజాగా భారత్‌తో సిరీస్‌లో దారుణంగా విఫలమయ్యాడు. తన చివరి టెస్టులో అయినా అలిస్టర్ రాణించాలని ఇంగ్లాండ్ అభిమానులు కోరుకుంటున్నారు
Here's our Playing XI for the game.#ENGvIND pic.twitter.com/AmDSpS2Tyw
— BCCI (@BCCI) September 7, 2018