తాజాగా ఈ సంఘటన ఆస్ట్రియాలో జరిగింది. ఆస్ట్రియాలోని యూనివర్శిటీ ఆఫ్ వియన్నాలో ఒక అమ్మాయి ఆర్కిటెక్చర్ కోర్స్ చేస్తుంది. ఆ కోర్సును సాదారణంగా అయితే కేవలం ఎనిమిది సెమిస్టర్స్‌లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. కాని ఆ అమ్మాయి వరుసగా ఫెయిల్ అవుతూ వస్తూ ప్రస్తుతం 13వ సెమిస్టర్ చదువుతూ ఉంది. ఈసారి అయినా ఆర్కిటెక్చర్ కోర్స్‌ను ఆమె పూర్తి చేస్తుందనే నమ్మకం తండ్రికి లేదు. దాంతో తండ్రి తన కూతురుపైనే కోర్టుకు వెళ్లాడు.
తన కూతురు ఆర్కిటెక్చర్ చదివి తనకు సాయంగా ఉంటుందని భావించి భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాను. కాని ఆమె ఎనిమిది సెమిస్టర్స్‌లో పూర్తి చేయాల్సింది 13 సెమిస్టర్స్ అయినా పూర్తి చేయడం లేదు. అందుకే ఆమెపై నాకు నమ్మకం పోయింది. ఆమె చదువు కోసం ఇప్పటి వరకు పెట్టిన పూర్తి మొత్తంను ఇప్పించాల్సిందిగా కోర్టును వేడుకుంటున్నాను అంటూ పిటీషన్ దాఖు చేశాడు. ప్రస్తుతం అతడి పిటీషన్‌పై విచారణలు జరుగుతున్నాయి.