Site icon TeluguMirchi.com

కరోనా ఎఫెక్ట్ : వాట్సప్ కూడా తగ్గించింది

కరోనా మహమ్మారి కారణంగా సోషల్ మీడియా లో ఫేక్ న్యూస్ ఎక్కువగా వైరల్ చేస్తున్నారు ఆకతాయిలు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న నేపథ్యంలో కరోనా కు సంబందించిన ఫేక్ వార్తలను ఎక్కువగా ప్రచారం చేస్తుండడం తో ప్రజలు ఖంగారు పడుతున్నారు. ఇది నిజమో..ఏది అబద్దమో అర్ధం కావడం లేదు. దీంతో వీటిపై ప్రభుత్వం నిఘా పెట్టింది. ఇప్పటికే కరోనా ఫై ఫేక్ వార్తలను ప్రచారం చేస్తునం వారిపై కేసులు నమోదు చేయగా..ఇప్పుడు వాట్సప్ కూడా ఫేక్ వార్తలపై దృష్టి పెట్టింది.

ఒకే సారి ఎక్కువ గ్రూపులకు, సభ్యులకు ఫార్వార్డ్ చేసే సందేశాల పరిమితిని తగ్గించింది. ఇప్పటి వరకు ఒకేసారి ఐదుగురికి ఫార్వార్డ్ చేసే అవకాశం ఉండగా.. ప్రస్తుతం దానిని నవీకరించింది. లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో ఇళ్లకే పరిమితమైన చాలా మంది పరిమితం కావడంతో.. వాట్సాప్‌లో ఫార్వర్డ్ చేసే విషయాలు భారీగా పెరిగిపోయాయి. కొన్ని పనికివచ్చే అంశాలు ఉన్నా.. తప్పుడు సమాచారం వ్యాప్తికి ఇది ఎక్కువ దోహదం చేస్తుంది… దీంతో.. వాట్సాప్ ఒక సమయంలో ఒక చాట్‌కు ఫార్వార్డ్‌లను పరిమితం చేసింది. అంటే ఒక సందేశాన్ని ఒక గ్రూప్, లేదా, ఒక వ్యక్తికి మాత్రమే… ఏకకాలంలో ఫార్వార్డ్ చేసే వీలు ఉంటుందన్నమాట.

Exit mobile version