ఈరోజుల్లో ప్రాణ స్నేహితుల్లాను సైతం మోసం చేస్తున్నారు. స్నేహం కంటే డబ్బే ముఖ్యమని భావిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకంలో స్నేహితుడికి నకిలీ వజ్రం అమ్మి రూ. 58 లక్షలు కొట్టేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
గ్రామానికి చెందిన డి.భాస్కరరావుకు బంగారుపాళ్యం మండలం నల్లంగాడుకు చెందిన దామోదరం, తవణంపల్లె మండలం సరకల్లుకు చెందిన బొజ్జయ్యతో పరిచయం ఉంది. ఈ పరిచయాన్ని అడ్డం పెట్టుకుని దామోదరం, బొజ్జయ్య, చిత్తూరు నగరంలోని కట్టమంచికి చెందిన శ్రీనివాసులతో కలిసి భాస్కరరావుకు ఓ వజ్రాన్ని రూ.58.60లక్షలకు విక్రయించారు. కొంత కాలం తర్వాత ఆ వజ్రాన్ని విక్రయించాలని వ్యాపారి వద్దకు తీసుకెళ్లాడు భాస్కరరావు. అయితే అది నకిలీ వజ్రమని సదరు వ్యాపారి చెప్పడంతో భాస్కరరావు ఖంగుతిన్నాడు. వెంటనే ఆ వజ్రాన్ని తనకు అమ్మిన ఆ ముగ్గురు వద్దకు వెళ్లి తన డబ్బు తిరిగి ఇచ్చేయాలని అడిగితే మాకు తెలియదంటూ వారు సమాధానం చెప్పారు. దీంతో సదరు వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు.