Site icon TeluguMirchi.com

ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడుస్తాయా లేదా అనేది ఆ రోజు తెలుస్తుంది..

కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా రైళ్లు కూడా బంద్ అయ్యాయి. ఏప్రిల్ 14 తో లాక్ డౌన్ ముగియనున్నడం తో ఏప్రిల్ 15 నుండి మళ్లీ రైళ్లు పట్టాలెక్కనున్నాయని రైల్వే అధికారులు తెలియజేసారు. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC ఏప్రిల్ 15 నుంచి బుకింగ్స్ స్వీకరిస్తుందని వెల్లడించారు.

ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల పున:ప్రారంభంపై ఈ నెల 12వ తేదీ తర్వాతే నిర్ణయం ప్రకటిస్తామని రైల్వే ప్రకటించింది. ఈ ప్రకటన ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఈ నెల 14 తర్వాత దశల వారీగా లాక్ డౌన్ ఎత్తివేస్తామని మోడీ సూచనలు ఇచ్చారు. దీంతో చాలా మంది రైల్వే బుకింగ్స్ చేసుకోవడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ఈ ప్రకటన చేసినట్టు చెబుతున్నారు. రైళ్ల షెడ్యూల్, వాటి ఫ్రీక్వెన్సీ, రేకుల లభ్యతతో పునరుద్ధరణ ప్రణాళికను రూపొందించుకోవాలని దేశంలోని అన్ని రైల్వే జోన్లకు రైల్వేశాఖ ఇప్పటికే అంతర్గత ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

Exit mobile version