Site icon TeluguMirchi.com

ఈపిఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త !

దేశంలో రెండో దశ కరోనా ఉద్ధృతితో చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలు విధించాయి. దీంతో వేతన జీవులు మళ్లీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో వారిని ఆదుకోడానికి ముందుకొచ్చింది EPFO. ఉద్యోగులు తమ ఈపీఎఫ్‌వో ఖాతా నుంచి అడ్వాన్స్‌ తీసుకునేందుకు మరోసారి వీలు కల్పించింది.

కరోనా రెండో దశ ఉద్ధృతిలో ఖాతాదారులకు అండగా ఉండేందుకు రెండోసారి నాన్‌ రిఫండబుల్‌ కొవిడ్‌ అడ్వాన్స్‌ తీసుకునే అవకాశం కల్పిస్తున్నాం.ఈ ప్రత్యేక నిబంధనను గతేడాది మార్చిలో ప్రకటించాం’’ అని కార్మికశాఖ ప్రకటించింది. ఉద్యోగులు మూడు నెలల బేసిక్‌, డీఏ జీతాన్ని లేదా భవిష్యనిధిలోని 75శాతం డబ్బును(ఏదీ తక్కువైతే అది) అడ్వాన్స్‌గా తీసుకునేందుకు వీలు కల్పించింది. ఇప్పుడు మరోసారి ఆ సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నవారు రెండోసారి కూడా అడ్వాన్స్‌ తీసుకోవచ్చని ప్రకటించింది.

Exit mobile version