ఈజిప్టు అధ్యక్షుడిని గద్దె దింపిన సైన్యం !

egypt_morsiఈజిప్టు అధ్యక్షుడు మోర్సీని సైన్యం బలవంతంగా పదవీచ్యుడిని చేసింది. ఏడాది క్రితం ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికోబడిన మోర్సీ.. ప్రజా వ్యతిరేకకార్యకలాపాలకు పాల్పడి ప్రజల విశ్వాసం కోల్పోయారు. దేశంలో నెలకొన్న అల్లర్ల దృష్ట్యా పదవి నుంచి తప్పుకోవాలని మోర్సీకి సైన్యం విధించిన 48 గంటల గడువు ముగియడంతో అధ్యక్షుడిని సైన్యం బలవంతంగా గద్దెదించింది. అయితే, సైన్యం చర్యలను ఆందోళనకారులు సైతం స్వాగతించారు. తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాన న్యాయమూర్తిని నియమించింది. ముందస్తు ఎన్నికలను సైన్యాధ్యక్షుడు జనరల్ అబ్దుల్ ఫతా అల్ సీసీ ప్రకటించాడు.