ఎంసెట్ మెడికల్ కౌన్సెలంగ్ ప్రారంభమైంది. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకూ సంబంధించి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఉమ్మడిగా ప్రవేశాలు నిర్వహిస్తోంది. ఇందుకోసం తెలంగాణ, ఏపీలోని ఐదు ఆన్లైన్ కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణలో హైదరాబాద్ జేఎన్టీయూ, వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయాల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైజాగ్‌లోని ఆంధ్రాయూనివర్సిటీ, విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ , తిరుపతి ఎస్వీ యూనివర్సిటీల్లో కౌన్సెలింగ్ ప్రారంభమైంది. నేటి నుంచి ప్రారంభైన మెడికల్ కౌన్సెలింగ్ సెప్టెంబరు 5వరకు కొనసాగనుంది.మరోవైపు కోరుకున్న సీటు రద్దు చేసుకుంటే లక్ష రూపాయల వరకు ఫైన్ విధిస్తామని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ స్పష్టం చేసింది..