తిరుమలలో డ్రెస్ కోడ్ అమలు !

tirumalaతిరుమల తిరుపతి దేవాస్థానం కొత్త నిబంధనలకు శ్రీకారం చుట్టింది. తిరుమల శ్రీవారి దర్శనార్ధం వచ్చే భక్తులు విఐపి బ్రేక్ దర్శనంలో తప్పనిసరి సాంప్రదాయ దుస్తులు ధరించాలని టిటిడి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ సాంప్రదాయ దుస్తుల వస్త్రదారణ విధానం ఈరోజు (బుధవారం) నుంచి అమల్లోకి వచ్చింది. శ్రీవారి ఆర్జిత సేవల్లో పాల్గోనే భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించే నిబంధన ఇప్పటికే అమల్లో ఉంది. అయితే ఈ నిబంధనను దశల వారిగా శ్రీవారి భక్తులందరికి అమలు చేయాలని టిటిడి యోచిస్తుంది.