Site icon TeluguMirchi.com

ఆంధ్ర ప్రదేశ్ కు శుభవార్త చెప్పిన కేంద్రం

కృష్ణా జిల్లా నాగాయలంక మండలం గుల్లలమోద వద్ద డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ ( DRDO ) అనే క్షిపణి పరీక్ష కేంద్రం అవసరమని 2012 వ సంవత్సరంలో కేంద్రానికి ఒక ప్రతిపాదన వచ్చింది.

ఇన్నేళ్లకు క్షిపణి ప్రయోగ కేంద్రం ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కృష్ణా జిల్లా నాగాయలంక ప్రాంతంలో గుల్లలమోదలో 154 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రయోగ కేంద్రం ఏర్పాటు చేయడానికి కేంద్రం సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పనులు వచ్చే దసరా నుంచి మొదలుపెడతారని సంబంధిత అధికారులు అంటున్నారు. తొలి దశలో 600 కోట్ల రూపాయలను ఈ భారీ ప్రాజెక్ట్ కోసం ఖర్చుపెట్టనున్నారు.

సముద్ర తీరానికి 12 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్ట్ ఉండడంతో క్షిపణి పరీక్షలకు అనువుగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్షిపణి ప్రయోగ కేంద్రం ప్రతిపాదన రాష్ట్రానికి రాగానే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. కాగా కేంద్ర పర్యావరణ, అటవీ శాఖల నుంచి క్షిపణి ప్రయోగ కేంద్రం ఏర్పాటు కోసం అనుమతి రావాల్సి ఉంది.ఈ ప్రక్రియ కూడా మరో రెండు మూడు రోజుల్లో పూర్తి అవుతుందని అధికార వర్గాల నుండి సమాచారం. ఇక ఇవి అన్ని జరిగేతే ఆంధ్ర ప్రదేశ్ కు దేశంలోనే రెండవ క్షిపణి ప్రయోగ కేంద్రం వస్తుంది.

Exit mobile version