కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి సమయంలో దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో తీవ్ర ఆక్సిజన్ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు పీఎం కేర్స్ నిధులతో దేశవ్యాప్తంగా 850 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు డీఆర్‌డీఓ వెల్లడించింది.
కరోనా పోరులో భాగంగా రానున్న రోజుల్లో అవసరమైన సమయంలో ‘ఫ్లయింగ్ హాస్పిటల్స్’ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు పేర్కొంది. సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న వేళ కొవిడ్ బాధితుల కోసం చాలా నగరాల్లో తాత్కాలిక ఆసుపత్రులను ఏర్పాటు చేశాం. వీటిని ఫ్లయింగ్ హాస్పిటల్స్‌గా పిలుస్తున్నాం. ఒకవేళ కరోనా థర్డ్ వేవ్ వస్తే.. ఇలాంటి ఆసుపత్రులను మళ్లీ అందుబాటులోకి తీసుకువస్తాం అని డీఆర్‌డీవో చీఫ్ సతీశ్ రెడ్డి పేర్కొన్నారు.