అక్టోబర్ 7 నుంచి షిర్డీ సాయిబాబా ఆలయంలో భక్తులను అనుమతించాలని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ (ఎస్‌ఎస్‌ఎస్‌టీ) నిర్ణయించింది. ఈమేరకు పలు నియమ నిబంధనలు పాటిస్తూ సాయిబాబాను దర్శించుకోవచ్చని ట్రస్ట్ పేర్కొంది.
అక్టోబరు7 (గురువారం) నుంచి ప్రతిరోజూ 15 వేల భక్తులకు మాత్రమే సాయి దర్శనం లభిస్తుంది. ఇందులో 5 వేల వరకు పెయిడ్ పాసులు, 5 వేల ఆన్‌లైన్ పాసులు, 5 వేల ఆఫ్ లైన్ పాసులు ఉంటాయి. గంటకు దాదాపు 1,150 మంది షిర్డీ సాయినాథుడిని దర్శించుకోవచ్చు.
భక్తులు కచ్చితంగా మాస్కులు ధరించాల్సి ఉంటుంది.
అదే విధంగా హారతి సేవకు కేవలం 90 మంది భక్తులను మాత్రమే అనుమతించనున్నారు.
గర్భిణులు, పదేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వారిని ఆలయంలోకి అనుమతించరు.