భారతీయ సంస్కృతిలో చీర ఓ భాగం. భారతీయ మహిళల్లో అత్యధిక మంది చీరను ధరిస్తారు. తాజాగా ఢిల్లీలోని ఒక రెస్టారెంటులో మహిళ చీర ధరించి లోపలి వెళ్తుండగా అక్కడి సిబ్బంది ఆమెని రెస్టారెంటులోకి అనుమతించలేదు దీంతో బాధిత మహిళ సామాజిక మాధ్యమాల్లో ఆ వ్యవహారం పోస్టు చేయగా వైరల్ అయింది.
చీర ధరించి వచ్చిన మహిళను లోపలికి అనుమతించని ఢిల్లీ లోని ఓ రెస్టారెంటు వ్యవహారంపై దర్యాప్తు జరపాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను NCW ఆదేశించింది. ఆ ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలనీ సూచించింది. ఈ నెల 28న తమ ఎదుట హాజరుకావాలని ఆ రెస్టారెంట్ మార్కెటింగ్, PR డైరెక్టర్‌కు నోటీసు జారీ చేసింది. వస్త్రధారణ ఆధారంగా మహిళలను రెస్టారెంటులోకి ప్రవేశించనీయకపోవడం గౌరవప్రదంగా జీవించే ఆమె హక్కుకు విఘాతం కలిగించినట్లే’నని ఎన్‌సీడబ్ల్యూ ఒక ప్రకటనలో పేర్కొంది.