Site icon TeluguMirchi.com

మర్కజ్‌ భవన్‌ మత పెద్దలు ఈ ట్రైన్స్ లలో ప్రయాణం చేశారట ..

ఢిల్లీ నిజాముద్దీన్ ఈ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైరల్ గా మారింది. మార్చి మొదటోయ్ రెండు వారాల్లో జరిగిన ప్రార్థనలకు విదేశాల నుండి మత పెద్దలు హాజరయ్యారు. వారి కారణంగా ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ పెరిగిపోయింది. ఈ ప్రార్థనలకు వెళ్లిన చాలామందికి కరోనా సోకింది. తెలుగు రాష్ట్రాల నుండి కూడా వందల సంఖ్యలో ఇక్కడి వెళ్లారు. కాగా ఈ మత ప్రచారకులు పలు ట్రైన్స్ లలో కూడా ప్రయాణం చేసినట్లు తేలింది.

గుంటూరుకు దురంతో ఎక్స్‌ప్రెస్‌, చెన్నైకు గ్రాండ్‌ ట్రంక్‌ ఎక్స్‌ప్రెస్‌, చెన్నైకు తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌, న్యూఢిల్లీ – రాంచీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌, ఏపీ సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ బయల్దేరాయి. అయితే ఈ రైళ్లల్లో 1000 నుంచి 1200 మంది చొప్పున ప్రయాణించిన వారిలో అత్యధికంగా మత ప్రార్థనలకు హాజరైన వారే ఉన్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. మార్చి 13న మత ప్రార్థనల్లో పాల్గొని ఏపీ సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో కరీంనగర్‌కు 10 మంది ఇండోనేషియన్లు వచ్చిన విషయం తెలిసిందే. న్యూఢిల్లీ – రాంచీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లోనూ 60 మంది దాకా ప్రయాణించినట్లు అధికారులు వెల్లడించారు.

Exit mobile version