Site icon TeluguMirchi.com

భారత్ లో భారీగా పెరుగుతున్న రోజువారీ కోవిడ్ కేసులు, ఆ 6 రాష్ట్రాల్లోనే ఎక్కువగా …

భారత్ లో రోజువారీ కొత్త కోవిడ్ కేసులు ఐదు రాష్ట్రాలు – మహారాష్ట్ర, పంజాబ్, కర్నాటక, చత్తీస్ గఢ్, గుజరాత్ లో ఎక్కువగా వస్తున్నాయి. గత 24 గంటలలో 47,262 కొత్త కేసులు రాగా అందులో 77.44% ఈ రాష్ట్రాలదే. ఆరు రాష్ట్రాలలో నమోదైన కేసుల వాటా 81.65%. మహారాష్ట్రలో అత్యధికంగా ఒక్క రోజులో 28,699 కేసులు రాగా పంజాబ్ లో 2,254, కర్నాటకలో 2,010 కేసులు వచ్చాయి.

భారత్ లో చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య 3,68,457 కి చేరుకుంది. గత 24 గంటలలో నికరంగా పెరిగిన కోవిడ్ చికిత్సలో ఉన్నవారి సంఖ్య 23,080. దేశవ్యాప్తంగా కోవిడ్ నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,12,05,160 కాగా దేశపు కోలుకున్నవారి శాతం 95.49%. గత 24 గంటలలో 23,907 మంది కోలుకున్నారు.

గత 24 గంటలలో 275 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. కొత్త మారణాలలో 83.27% ఆరు రాష్ట్రాలలో నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 132 మంది కోవిడ్ తో మరణించగా పంజాబ్ లో 53 మంది, చత్తీస్ గఢ్ లో 20 మంది చనిపోయారు. గత 24 గంటలలో ఒడిశా, లక్షదీవులు, లద్దాఖ్, మణిపూర్, డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, మేఘాలయ, మిజోరం, సిక్కిం, త్రిపుర, అండమాన్-నికోబార్ దీవులు, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ లో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు.

Exit mobile version