నివర్ తుఫాను గండం గడిచిందో లేదో మరో తుఫాన్ గండం మొదలైంది. ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న తీవ్ర అల్పపీడనం బలపడుతోంది. ఈ తుఫాన్ కు ‘బురేవి’ గా నామకరణం చేసారు. దీని ప్రభావం వల్ల రానున్న 36 గంటల్లో దక్షిణ కోస్తా ఆంధ్రలో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉండగా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని, చిత్తూరు జిల్లాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే అకాల వర్షాల కారణంగా చేతికొచ్చిన పంట నష్టపోగా..ఇప్పుడు పలు తుఫాన్ల కారణంగా ఉన్న కొద్దీ పంట కూడా చేతికి అందకుండా పోతుందని రైతులు వాపోతున్నారు.