పగ బట్టిన కాకి..ఏకంగా 7 గురిపై దాడి

కాకులు అరవడమే కానీ దాడి చేయవని ఇప్పటివరకు తెలుసు..కానీ ఇక్కడ మాత్రం ఓ కాకి..పగపట్టి ఏకంగా ఏడుగురి ఫై దాడి చేసింది. ఈ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గం తాలూకా ఓబళాపురం గ్రామంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..

గ్రామంలో కొన్ని రోజులుగా సంచరిస్తున్న ఓ కాకి గ్రామస్థుల్లో కొందరిని మాత్రమే టార్గెట్ చేసుకుంది. వారు గుంపులో ఉన్నా సరే ఎగిరొచ్చి వారిపైనే దాడిచేస్తోంది. గోళ్లతో రక్కుతూ, ముక్కుతో పొడుస్తోందని, మొత్తంగా గ్రామంలోని ఏడుగురిపై అది పగబట్టి దాడిచేస్తోందని గ్రామస్థులు తెలిపారు. గ్రామం నుంచి కాకిని తరిమేందుకు ప్రయత్నిస్తున్నా వెళ్లడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. మరి ఈ కాకి ఎందుకు పగ పట్టిందో ఎవరికీ అర్థంకావడం లేదు.