కోవిషిల్డ్ వాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నారా… అయితే ఇది మీ కోసమే !

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. కరోనా నియంత్రణకు దేశంలో కొవాక్సీన్, కోవిషిల్డ్ వాక్సిన్ డోస్ లను ప్రజలకు ఇస్తుంది. అయితే దేశంలో డిమాండ్ కి తగ్గట్లు వాక్సిన్ డోస్ లను ఉత్పత్తి చేయలేకపోతున్నాయి వాక్సిన్ తయారీసంస్థలు. అయితే కోవిషిల్డ్ వాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్న వారికోసం కేంద్రం కొత్త గైడ్లైన్స్ విడుదల చేసింది.

. కోవిషిల్డ్ వాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్న వారు 12 నుండి 16 వారాల గ్యాప్ తీసుకోవచ్చు.
. ఇప్పటినుండి ఆన్లైన్ లో గాని, ఆఫ్ లైన్ లోగాని కోవిషిల్డ్ వాక్సిన్ సెకండ్ డోస్ ను తీసుకోవడానికి 84 రోజుల గడువు తప్పనిసరి.
.ఇప్పటికే 84 రోజుల కంటే తక్కువ గడువులో బుక్ చేసుకున్న వారికి వాక్సిన్ యధాతధంగా ఇవ్వబడుతుంది.