వరంగల్ లో కొత్త స్ట్రెయిన కేసు నమోదు

కరోనా మహమ్మారి ఉదృతి తగ్గుతుందని అంత సంబర పడుతున్న వేళా..ఇప్పుడు కొత్త స్ట్రెయిన కేసులు బయటపడడం అందర్నీ భయాందోళనకు గురి చేస్తున్నాయి. గత తొమ్మిది నెలలుగా కరోనా కు ఎంతో మంది బలయ్యారు. అలాగే లాక్ డౌన్ కారణంగా లక్షల మంది జీవితాలు రోడ్డున పడ్డాయి. ఇక ఇప్పుడిప్పుడే ప్రపంచం బయటకు వస్తున్న క్రమంలో స్ట్రెయిన కేసులు బయటపడుతున్నాయి.

మనదేశంలో ఇప్పటి వరకు ఆరు కొత్త కేసులు బయటపడ్డాయి. బెంగుళూరు 3 , హైదరాబాద్ 2 , పూణే లో ఓ కేసు నమోదు అయ్యింది. ఇదిలా ఉంటె తాజాగా వరంగల్ లో కొత్త స్ట్రెయిన కేసు బయటపడింది. యూకే నుంచి వచ్చిన వరంగల్ వ్యక్తికి కొత్త కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించారు.ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది. సీసీఎంబీ రిపోర్టులో ఇదే విషయం వెల్లడించారు. నేడో రేపో కేంద్రం కూడా దీనిపై అధికారికంగా ప్రకటన చేయనుంది. అయితే కొత్త రకం కరోనా విషయంలో భయాందోళనలు వద్దని ప్రభుత్వం చెబుతోంది. స్ట్రెయిన్ వైరస్ సోకిన వరంగల్‌ వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉందని, కొద్ది రోజుల్లోనే డిశ్చార్జి అవుతారని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి.