Site icon TeluguMirchi.com

కోవాక్సిన్ , కోవిషీల్డ్ డోసుల దొంగతనం

హర్యానాలోని జింద్ జిల్లా లో నుండి 1,270 మోతాదుల కోవిషీల్డ్ మరియు 440 మోతాదు కోవాక్సిన్ దొంగిలించబడ్డాయి. ఈ రోజు ఉదయం ఆరోగ్య శాఖ సిబ్బంది వచ్చి చూడగా జింద్ సివిల్ ఆసుపత్రిలో స్టోరేజ్ గది తాళాలు పగిలి ఉండటం గమనించి గది లోపలి వెళ్లి చూడగా వాక్సిన్ డోసులను ఎవరో దొంగిలించారని గమనించి వెంటనే పోలీసులకు పిర్యాదు చేసారు. గదిలో ఉన్న కొన్ని పత్రాలు / ఫైళ్లు మరియు నగదు రూ. 50,000 దుండగులు తాకలేదు అని దర్యాప్తు అధికారి ఒకరు చెప్పారు.

Exit mobile version