Site icon TeluguMirchi.com

వెంటిలేషన్ వ్యవస్థ తో కూడిన పి.పి.ఇ కిట్ ని ఆవిష్కరించిన ఇంజనీరింగ్ స్టూడెంట్, తల్లి పడే కష్టం చూడలేక !

అవసరమే ఆవిష్కరణకు దారి తీస్తుంది. అవసరం ఏర్పడినందునే ముంబైకి చెందిన నిహాల్ సింగ్ ఆదర్శ్ అనే విద్యార్థి ఏకంగా ఒక ఆవిష్కర్తగా మారారు. వైద్యురాలైన తన తల్లికి ఏర్పడిన అవసరమే అతని ఆవిష్కరణకు గట్టి స్ఫూర్తిని రగిలించింది. కోవ్-టెక్ పేరిట వ్యక్తిగత రక్షణ సూట్లకు (పి.పి.ఇ.)  సృజనాత్మకమైన రీతిలో వెంటిలేషన్ వ్యవస్థను నిహాల్ రూపొందించారు. ఈ చల్లని పి.పి.ఇ. సూట్ల ధారణతో ఫ్రంట్ లైన్ కోవిడ్ యుద్థవీరులుగా పరిగణించే, ఆరోగ్య రక్షణ కార్యకర్తలకు ఎంతో ఉపశమనం లభించినట్టయింది.

కోవ్-టెక్: పూర్తిగా విభిన్నం,.. ‘చల్లని’ పి.పి.ఇ. అనుభవం

కోవ్-టెక్ పేరిట చల్లని పి.పి.ఇ. కిట్ కు రూపకల్పన చేసిన నిహాల్ సింగ్ ఎంతో మానసిక సంతృప్తితో  పి.ఐ.బి.తో మాట్లాడారు. కె.జె. సోమయ్యా ఇంజినీరింగ్ కాలేజీలో రెండవ సంవత్సరం ఇంజినీరింగ్ చదివే నిహాల్ సింగ్, తన ఆవిష్కరణపై పి.ఐ.బి.తో పలు విషయాలు చెప్పారు. కరోనా యుద్ధవీరులుగా మనం గౌరవించే ఆరోగ్య రక్షణ కార్యకర్తలు,. కోవ్-టెక్ సదుపాయంతో కూడిన పి.పి.ఇ. కిట్.ను ధరించినపుడు వారికి అది అందించే సౌలభ్యాన్ని గురించి వివరించారు.: “కోవ్-టెక్ వెంటిలేషన్ వ్యవస్థ పి.పి.ఇ. సూట్ ను పూర్తి విభిన్నంగా మార్చుతుంది. మీరు పి.పి.ఇ. సూట్ ధరించినా ఎంతో సౌకర్యంగా, సౌలభ్యంగా, ఫ్యాన్ కింద కూర్చుకున్నట్టుగా హాయిగా ఉంటుంది. మామూలుగా అయితే, పి.పి.ఇ. సూట్లో ఉన్నపుడు ఎవరికైనా ఉక్కపోత, చెమటతో కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ; ఎంతో ఇబ్బందిగా ఉండే ఈ పరిస్థితినుంచి గట్టెక్కేందుకు మేం ఈ రూపంలో పరిష్కారం చూపించాం. పి.పి.ఇ. సూట్లో ఉన్నవారికి కూడా క్రమబద్ధంగా గాలి ఆడేలా చేస్తూ ఈ సౌలభ్యం తీసుకువచ్చాం.” అని నిహాల్ సింగ్ అన్నారు. పి.పి.ఇ. కిట్ సౌకర్యవంతంగా ఉండేలా ఈ వెంటిలేషన్ వ్యవస్థ నమూనాను రూపొందించామని,. సూట్ వేసుకున్న కేవలం వంద సెకన్లలోనే సూట్ ధరించిన వారికి తాజాగా చల్లని గాలి సోకేలా ఈ వ్యవస్థను అమర్చామని చెప్పారు.

ఖరారైన తుది నమూనా ప్రకారం తయారైన ఉత్పాదనను, నడుం చుట్టూ ఓ బెల్టులాగా  ధరించవచ్చు. మామూలు పి.పి.ఇ. కిట్లతో కూడా దీన్ని ధరించవచ్చు. ఈ నమూనాతో రెండు ప్రయోజనాలు లభిస్తాయి.:

  1. ఆరోగ్య కార్యకర్తలకు అసౌకర్యం తొలగిపోతుంది. వెంటిలేషన్ బాగుంటుంది.
  2. వివిధ రకాల ఫంగస్ ఇన్ఫెక్షన్ల నుంచి వారికి రక్షణ ఉంటుంది.

  వెంటిలేషన్ వ్యవస్థను శరీరానికి దగ్గరగా ధరిస్తారు కాబట్టి రక్షణకోసం ఈ నమూనాలో అత్యున్నత స్థాయి నాణ్యతా ప్రమాణాలతో కూడిన విడిభాగాలను ఉపయోగించామని, భద్రతా పరమైన చర్యలు  జాగ్రత్తగా తీసుకున్నామని నిహాల్ చెప్పారు. “ఈ ఉత్పాదనకు సంబంధించి పేటెంట్ కోసం దరఖాస్తు చేయబోతున్నానని చెప్పగానే మా అమ్మకు చెప్పగానే ఆమె ఎంతగానో సంతోషించారు. జనరల్ పిజీషియన్ అయిన మా అమ్మ తాను విధినిర్వహణకు వెళ్లినపుడల్లా ఈ ఉత్పాదనను క్రమం తప్పకుండా వాడుతున్నారు.” అని చెప్పారు. ఈ పరికరంలో వెంటలేషన్ వ్యవస్థలో లీథియం-అయాన్ బ్యాటరీ అమర్చి ఉంటుంది. ఈ బ్యాటరీ ఆరునుంచి 8గంటలు పనిచేస్తుంది.  

Exit mobile version